ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపల్లె చేరుకున్నారు. నిన్న విరామం ప్రకటించిన జగన్ ఇవాళ మూడు చోట్ల పర్యటిస్తారు. కూటమి నేతలను టార్గెట్ చేస్తూ, చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఐదేళ్లలో తాను చేసిన మంచిని వివరిస్తూ, సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ మరోవైపై ప్రతిపక్ష కూటమిపై విరుచుకు పడుతూ సీఎం జగన్ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ప్రచారంలో భాగంగా బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని రేపల్లెకు చేరుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్ మహల్ సెంటర్‌లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. జగన్ కు జనం కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు.
మూడు నియోజకవర్గాల్లో నేడు జగన్ ప్రచారం
0
273
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


