ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై కోర్టు కొట్టివే సింది. కవితకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసు ల్లోనూ బెయిల్‌కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు వెలువరించారు. లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్టు చేసింది. ఇదే కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే, ఏప్రిల్ 11న సీబీఐ కూడా పీటీ వారెంట్‌తో ఆమెను అరెస్టు చేసింది. ఈ కేసులకు సంబంధించి కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ రెండు బెయిల్ పిటిషన్లను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ పిటిషన్లపై వాదనలను ఇప్పటికే పూర్తి చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఈ క్రమంలో కవిత పిటిషన్లను కొట్టివేస్తు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.
కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన కోర్టు
0
198
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


