ISRO launches new rocket SSLV-D2 from Sriharikota: ఒక చిన్న ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎస్ఎల్వీ డీ 2 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఎంతో పెద్ద పెద్ద రాకెట్లను అతి సులువుగా అంతరిక్షంలోకి పంపించే ఇస్రోకి…ఈ చిన్న రాకెట్ పంపించడం పెద్ద కష్టమేం కాలేదు.
తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి (షార్) నుంచి ఈ ఉపగ్రహ ప్రయోగం జరిగింది.శుక్రవారం వేకువజామున 2.48 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అలా 6.30వరకు కొనసాగింది.

అప్పుడు ఒకటికి రెండుసార్లు అన్నీ చెక్ చేసుకుని, అంతా పెర్ ఫెక్షన్ వచ్చిన తర్వాత ఉదయం 9.18 గంటలకు షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీడీ-2 విజయవంతంగా నింగిలోకి ప్రవేశించింది. అనంతరం ప్రయోగం సక్సెస్ అయినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఈ ఎస్ఎస్ఎల్వీడీ-2 ద్వారా ఇస్రోకు చెందిన ఈవోఎస్ (156.3కిలోల బరువు) ఉపగ్రహంతో పాటు, యూఎస్ఏ అంటారిస్ సంస్థకు చెందిన జానూస్-1 (11.5కిలోలు), చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు రూపొందించిన (8.7 కిలోలు) ఆజాదీశాట్-2ను భూ సమీప కక్షలో పెట్టారు.
450 కిమీ ఎత్తులో మూడింటిని ఒక దాని తర్వాత ఒకొక్కటిగా సెకన్ల వ్యవధిలో కక్ష్యలో ప్రవేశపెట్టింది.