34.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

చంద్రయాన్- 3కి ముహుర్తం ఖరారు..

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న చంద్రయాన్‌-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారయ్యింది. జులై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3లో భాగంగా జీఎస్ఎల్వీ-ఎంకే3 లేక ఎల్వీమ్3 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రెండు దఫాలు చంద్రయాన్ చేపట్టి మిశ్రమ ఫలితాలు అందుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మూడోసారి చంద్రయాన్ చేపడుతోంది. చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉండగా… చంద్రయాన్-3లో ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ ను పొందుపరిచారు. చంద్రయాన్-2లోని ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో విఫలమైన నేపథ్యంలో, అనేక మార్పులు చేర్పులతో చంద్రయాన్-3 ల్యాండర్ ను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.615 కోట్లు కేటాయించింది.

విక్రమ్ ల్యాండర్ కు బలమైన కాళ్లు అమర్చారు. అత్యధిక వేగంగా దిగినప్పటికీ దెబ్బతినని రీతిలో ల్యాండర్ కు రూపకల్పన చేశారు. ఇంజిన్, సెన్సర్, థ్రస్ట్ వైఫల్యాలను గుర్తించి చక్కదిద్దేందుకు అధునాతన సాఫ్ట్ వేర్ ఉపయోగించనున్నారు. చంద్రయాన్-2 నుంచి నేర్చుకున్న గుణపాఠాల నేపథ్యంలో, చంద్రయాన్-3లో సెంటర్ ఇంజిన్ లేదా ఐదో ఇంజిన్ ను తొలగించనున్నారు. ఇక, విక్రమ్ లాండర్ చంద్రుడిపై సూర్యరశ్మి సోకని ప్రాంతంలో ల్యాండైనప్పటికీ ఇంధన శక్తిని పొందేందుకు వీలుగా మరిన్ని సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నామని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ తెలిపారు.

Latest Articles

నేను బీజేపీని ఓడించిన ముఖ్యమంత్రిని..రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ.. విభజించి పాలించడం బీజేపీ విధానమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాజా చిట్‌చాట్‌లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్