విజయవాడ, పరిసర ప్రాంతాల్లో కృష్ణానది వరద భాదితుల సహాయార్థం ఈశా ఫౌండేషన్ ఔట్రీచ్ ద్వారా ఈశా వాలంటీర్లు తమ వంతు చేయూతను అందించారు.
సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి నిత్యావసరాలను కిట్ ల రూపంలో పంపిణీ చేశారు. 13 నిత్యావసర వస్తువులతో కూడిన దాదాపు 1000 కిట్ లను సుందరయ్య నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీ, రాజీవ్ నగర్, గంగానమ్మ గుడి, నాలుగు స్తంభాల లైన్ మొదలగు ప్రాంతాల్లో వరద బాధిత పేద కుటుంబాలకు అందించారు.
సహాయాన్ని అందుకున్న వారు ఎంతో అవసరమైన, నాణ్యమైన సరుకులను అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.