పెద్దిపై జాన్వీకి కోపమా..?

పెద్ది ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పెద్ది అప్ డేట్స్ ఇస్తూ బాగా బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక బుచ్చిబాబు ఓ వైపు ఇంటర్ వ్యూలు.. మరో వైపు సోషల్ మీడియాలో పోస్టులు.. పెడుతూ పెద్ది మూవీని జనాల్లోకి బాగా తీసుకెళుతున్నారు. అయితే.. పెద్ది ప్రమోషన్స్ లో ఎక్కడా జాన్వీ కపూర్ మాత్రం కనిపించడం లేదు. దీంతో జాన్వీకి కోపం వచ్చిందని.. అందుకనే ప్రమోషన్స్ లో కనిపించడం లేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అసలు.. ఏమైంది..? ఇందులో జాన్వీ పాత్ర ఎలా ఉండబోతుంది..? నిజంగానే జాన్వీకి కోపం వచ్చిందా..? తెలుసుకుందాం రండి..

పెద్ది సినిమాకి అంతా లైన్ క్లియర్ అవ్వడంతో.. ప్రమోషన్స్ లో జోరు పెంచారు. అయితే.. చరణ్‌, బుచ్చిబాబు, టెక్నికల్ టీమ్ ప్రమోషన్స్ లో కనిపిస్తున్నారు కానీ.. జాన్వీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది. మేటర్ ఏంటంటే.. దేవర సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకి ఆ సినిమాలో క్యారెక్టర్ కు అంతగా ప్రాధాన్యత లేదు. అందుకనే.. పెద్ది సినిమా పై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ మూవీలో కూడా ఆమె పాత్రకు ప్రాధాన్యం లేకపోవడం వల్లే దూరంగా ఉందని, రకరకాలుగా కథనాలు అల్లేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఇలా ప్రచారం జరుగుతుంటే.. ఇన్ సైడ్ టాక్ మాత్రం వేరేలా ఉంది. పెద్ది హీరో సెంట్రిక్ మూవీనే అయినప్పటికీ హీరోయిన్ కు క్యారెక్టర్ కు కూడా ప్రాధాన్యం ఉండేలా డిఫరెంట్ గా డిజైన్ చేసారట డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ స్టోరీకి సంబంధించిన అసలైన ట్విస్ట్ జాన్వీతోనే ఉంటుందట. ఎమ్మెల్యే కూతురుగా ఈ బ్యూటీ తనదైన్ పర్ ఫార్మెన్స్ తో షాక్ ఇవ్వడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే.. జాన్వీకి టాలీవుడ్లో మరింత క్రేజ్ పెరగడం ఖాయం.

ఇక ప్రమోషన్స్ విషయానికి వస్తే ముంబైలో జరిగే పెద్ది ట్రైలర్ లాంచ్ లో జాన్వీ కపూర్ ఉంటుందట. భోపాల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ కు స్పెషల్ సాంగ్లో నటించిన శృతి హాసన్ వస్తుందట. ఇక హైదరాబాద్లో జరిగే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జాన్వీ పక్కాగా వస్తుందట. అయితే.. చెన్నై, బెంగళూరులో జరిగే ఈవెంట్స్ లో ఒక్క ఈవెంట్ కు మాత్రమే జాన్వీ వస్తుందని టాక్. చరణ్‌, జాన్వీ ఫస్ట్ టైమ్ కలిసి నటించడంతో ఈ కాంబో తెర పై సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి.. పెద్ది ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Latest Articles

రూ. 2,000 అద్దె చెల్లించలేక.. భార్య, కూతురిపై ఇంటి యజమాని అత్యాచారానికి ఒప్పందం

గుజరాత్‌లోని మోర్బీలో అమానుష ఘటన జరిగింది. అద్దె బకాయిలు చెల్లించలేకపోయిన ఓ వ్యక్తి, తన భార్యతో పాటు మైనర్ కుమార్తెపై ఇంటి యజమాని లైంగిక దాడి చేయడానికి ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలపై పోలీసులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్