ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. గుర్తింపు కాలేజీల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాతే అడ్మిషన్లు తీసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య హెచ్చరించారు.
వార్షిక పరీక్షలు పూర్తి కాక ముందే అప్పుడే కొన్ని ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్లు తీసుకోవడం మొదలుపెట్టాయి. విషయం తెలుసుకున్న ఇంటర్ బోర్డు.. 2025 – 26 విద్యా సంవత్సరం అఫిలియేషన్ పక్రియ మొదలు కాలేదని తెలిపింది. అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అలా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ఇంటర్ బోర్డు షెడ్యూల్ రిలీజ్ చేయక ముందు అడ్మిషన్లు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ఇంటర్ కాలేజీలు వ్యవహరించరాదని మండిపడింది. జూనియర్ కాలేజీల గుర్తింపు విషయంలో సీరియస్ గా ఉన్న ఇంటర్ బోర్డు ఈసారి ముందుగానే దృష్టి పెట్టింది.
రాష్ర్టంలో 1400 పైగా ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్ కాలేజీలు ఉన్నాయి. గుర్తింపు లేకపోయినా అడ్మిషన్లు తీసుకున్న కాలేజీలకు లక్ష రూపాయల ఫైన్లు వేసింది ఇంటర్ బోర్డు.