ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్ ప్రకటించింది. జూన్ 19 వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను రాష్ట్ర నిఘా విభాగం హెచ్చరించింది. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రతీకారదాడులకు అవకాశం ఉందని తెలిపింది. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీఎస్పీ బలగాలను పంపుతామని, అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని పేర్కొంది. జిల్లాల ఎస్పీలకు సందేశం పంపింది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికల అనంతరం పలు ప్రాంతా ల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సిట్ ఏర్పాటు చేసి ఘటనపై నివేదిక కోరింది. ఇప్పటికే పదుల సంఖ్యలో నిందితులను పోలీసులు అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఇంటెలిజెన్స్ అలర్ట్
0
352
Previous article
Latest Articles
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు- చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాతావరణ సమతుల్యం దెబ్బతిందని చంద్రబాబు అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని...
- Advertisement -
- Advertisement -


