అనంతపురం జిల్లా తాడిపత్రిలో రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టా ముట్టారని తెలుపుతూ తాజాగా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు ఆయన అనుచరులు. వైసీపీ కార్య కర్తలపై విచక్షణారహితంగా పోలీసులు దాడి చేశారని పెద్దారెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు.దీనిపై ఈసీకి వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో తలుపులు పగలగొట్టి ప్రవేశించి కార్యకర్తలను కొడుతున్నట్లున్న సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాని ఆధారంగా దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ లీగల్ సెల్ కోరింది. కాగా, ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడంతో కలకలం రేగుతోంది. తాడిపత్రి పట్టణంలో పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. పోలీసు బందోబస్తు పెంచారు. ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ ఘర్షణలు చోటుచేసుకుం టుండడం కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటికే ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసి చర్యల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.
తాడిపత్రి ఎమ్మెల్యే ఇంటిని పోలీసులు చుట్టుముట్టిన వీడియో వైరల్
0
209
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


