స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రయాణికులతో అమృత్‌సర్ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తున్న ఇండిగో విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పాకిస్థాన్ గగనతలంలోకి దూసుకెళ్లిపోయింది. దాదాపు 30 నిమిషాలపాటు పాక్ ఎయిర్‌స్పేస్‌లోనే ప్రయాణించి లాహోర్‌కు సమీపంలో ఉన్న గుర్జన్‌వాలా వరకు వెళ్లిపోయింది. ఈ ఘటన శనివారం రాత్రి 7.30 సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. చివరికి రాత్రి 8.01 గంటలకు తిరిగి భారత్‌కు చేరినట్లు సమాచారం. ఇండిగో అధికారి ఒకరు ఆదివారంనాడు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వాతావరణ ప్రతికూలత కారణంగా అటారీ మీదుగా పాకిస్థాన్ గగనతంలోకి విమానం ప్రవేశించినట్టు చెప్పింది. విమానం డైవర్షన్ విషయంలో అటు పాకిస్థాన్ ఏటీసీ, అమృత్‌సర్ ఏటీసీలు ఫోనులో వివరాలు ఇచ్చిపుచ్చుకుంటూ చక్కటి సమన్వయంతో వ్యవహరించాయని, 30 నిమిషాల అనంతరం విమానం సరైన మార్గంలోకి ప్రవేశించి సురక్షితంగా అహ్మాదాబాద్ చేరుకున్నట్టు తెలిపింది.