మార్వెల్ సినిమాలు రిలీజ్‌కి రెడీ అయితే చాలు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాల్లో కనిపించే సూపర్ హీరోల అభిమానులు సంబరాల్లో మునిగితేలుతుంటారు. మార్వెల్ యూనివర్స్ నుంచి డెడ్ పుల్ సిరీస్‌లో భాగంగా జూలై 26న డెడ్ పుల్ & వాల్వరిన్ మూవీ రిలీజ్‌కి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ రేపుతోంది. ఈసారి డెడ్ పుల్‌తో పాటు వాల్వరిన్ కూడా వెండితెరపై అద్భుత విన్యాసాలు చేయబోతున్నాడు. ఇద్దరు సూపర్ హీరోలు ఒకేసారి అభిమానుల ముందుకు రానున్న నేపథ్యంలో డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ మోస్ట్ ఫెవరేట్ మార్వెల్ మూవీగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ రీత్య హైదరాబాద్‌లో మార్వెల్ సినిమాల అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే డెడ్ పుల్ & వాల్వరిన్ టికెట్లు బుకింగ్ మొదలైన సందర్భంగా తమ అభిమానాన్ని పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ చాటుకున్నారు. ఈ సెలబ్రేషన్ వీడియోలు ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతున్నాయి. డెడ్ పుల్ & వాల్వరిన్‌లో ప్రధానపాత్రధారులుగా రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్‌మెన్ నటిస్తున్నారు. జూలై 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో డెడ్ పుల్ & వాల్వరిన్ విడుదలకానుంది.
హైదరాబాద్‌లో మార్వెల్ ఫ్యాన్స్ సంబరాలు
0
512
Previous article
Next article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


