త్వరలో చైనా రికార్డు బద్దలుకొట్టనున్న ఇండియా

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుంది. ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న చైనాను ఈ ఏడాది మధ్యలో భారత్ దాటనుందని ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్’ 2023 నివేదికలో ఐక్యారాజ్యసమితి తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 142.85కోట్లు లేదా 142.86కోట్ల జనాభాతో ఇండియా తొలి స్థానం దక్కించుకుంటుందని అంచనా వేసింది. 142.57కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో.. 340మిలియన్ల జనాభాతో అమెరికా మూడవ స్థానంలో ఉంటాయంది.

2023ఫిబ్రవరి వరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి ఈ నివేదిక తయారుచేసినట్లు పేర్కొంది. అయితే గత నివేదికలో ఈ నెలలోనే చైనా జనాభాను భారత్ దాటిపోతుందని అంచనా వేయగా.. తాజా రిపోర్టులో మాత్రం ఏ నెలలో దాటుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. 2011తర్వాత ఇండియాలో జనగణన జరగలేదని.. దీంతో ఇప్పుడే చెప్పలేమని చెప్పింది. 1960 తర్వాత చైనాలో జనాభా తగ్గడం ప్రపంచంలో అనేక మార్పులు తీసుకురానుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్