కాంగ్రెస్ పార్టీ శకటం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల శకటం ప్రారంభమైంది. శకటాన్ని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్, చామాల కిరణ్ రెడ్డి పాల్గొన్నారు.
టైగర్ రిజర్వ్ లో ప్లాస్టిక్ నిషిద్ధం
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నిన్నటి నుంచి ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించామన్నారు కలెక్టర్ ఉదయ్ కుమార్. ప్రత్యామ్నాయ వాటిని వాడాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం కూడా పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. గ్రామ ప్రజలు, పర్యాటకులు ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్, ప్లేట్స్ వాడరాదని చెప్పారు. చెక్ పోస్ట్ వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈత వనం దగ్దం
తాటి, ఈత వనం మంటల్లో కాలిపోయిన సంఘటన…వరంగల్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో చోటుచేసు కుంది. పంట పొలాల్లో నిప్పు పెట్టడంతో అది గాలులకు పెరిగి వనంను అంటుకుంది. దీంతో 300 తాటి చెట్లు, 100 చెట్లు పూర్తిగా కాలిపోయాయి. కల్లు వారే చెట్లు కాలిపోవడంతో గౌడ కార్మికులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని గౌడ కులస్తులు వేడుకుంటున్నారు.
భారీ అగ్ని ప్రమాదం
కామారెడ్డి జిల్లా సిరిసిల్ల రోడ్డులోని ఓ పాత ఇనుప సామాను దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంలో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. మున్సిపల్ కార్మికులు చెత్త కుప్పకు నిప్పు పెట్టడడంతో నిప్పు రవ్వలు గాలికి దుకాణంలో పడి మంటలు అంటుకున్నట్లు స్థానికులు తెలిపారు.
బాలిక మృతి
పెద్దపల్లి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. సాగర్ రోడ్డుకు చెందిన వైష్ణవి అర్థరాత్రి పాముకాటుతో మృతి చెందింది. ఇంట్లో ఫ్రిడ్జ్ డోర్ తీసి నీళ్ల బాటిల్ తీసుకునే క్రమంలో దాని కింద నుంచి పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు ఎలుక కొరికి ఉంటుందని భావించి పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పెద్దపల్లిలోనే ట్రీట్‌మెంట్ చేసి ఉంటే తమ పాప బ్రతికేదని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
తులసి రెడ్డి ప్రత్యేక పూజలు
నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రేతా యుగంలో వైశాఖ బహుళ దశమి నాడు అంజనీదేవి, కేసరి పుణ్య దంపతులకు జన్మించాడని చెప్పారు. ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి, భక్తికి, నమ్మకానికి ప్రతిరూపం ఆంజనేయ స్వామి అని వెల్లడించారు. అసలు ఆంజనే యుడు లేకపోతే రామాయణమే లేదని తులసిరెడ్డి వివరిం చారు.
ఘనంగా హనుమాన్ శోభాయాత్ర
హనుమాన్‌జయంతిసందర్భంగా భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆంజనేయస్వామి ఆలయాలలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
హనుమాన్ జయంతి
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో హనుమద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించు కున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా లక్ష తమలపాకుల పూజ, నిత్య హోమము, బలిహరణలు, నీరాజన మంత్ర పుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయని ఆలయ ఈఓ కొండల రావు తెలిపారు.
హనుమాన్ జయంతి
తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయస్వామి వారికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. హనుమజ్జయంతి సందర్భంగా ఆకాశగంగ తీర్థంలోని శ్రీ బాలంజనేయ స్వామి వారికి ఐదు రోజుల పాటు అభిషేకం నిర్వహిస్తున్నట్లు ఈవో చెప్పారు.
హనుమాన్ జయంతి
కృష్ణజిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ జయంతి వేడుకల్లో యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, బడేటి రాధాకృష్ణ పాల్గొన్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.