ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. పలువురు ప్రముఖులు ఓటు వేశారు. UP సీఎం యోగి ఆదిత్యానాథ్ ఓటు వేశారు. రాఘవ్ చద్దా, రవికిషన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటు వేశారు. హిమాచల్ ప్రదేశ్ బిలాస్‌పూర్‌లో జేపీ నడ్డా, హిమాచల్ ప్రదేశ్‌లో కంగనా రనౌత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఏడో దశలో భాగంగా 57 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రు లు అనురాగ్ ఠాకుర్, ఆర్.కె.సింగ్, మహేంద్రనాథ్ పాండే, పంకజ్ చౌధరీ, అనుప్రియా పటేల్ సహా పలువురు ప్రము ఖులు ఈ విడతలో బరిలో ఉన్నారు. ఏడో దశలో పంజాబ్‌లోని మొత్తం 13, హిమాచల్ ప్రదేశ్‌లోని 4, పశ్చిమ బెంగాల్ లోని 9, బీహార్‌లోని 8, ఒడిశాలోని 6, జార్ఖండ్‌లోని 3, చండీ గఢ్‌లోని ఒక స్థానానికి కూడా ఓటింగ్ జరగనుంది. చివరి దశ ఓటింగ్‌లో ఒడిశా అసెంబ్లీలోని మిగిలిన 42 స్థానాలతో పాటు, హిమాచల్ అసెంబ్లీలోని ఆరు స్థానాల ఉపఎన్నిక లకు కూడా ఓటింగ్ జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి.
18వ లోక్‌సభను కొలువుదీర్చేందుకు జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహిస్తు న్నారు. ఈ దశలో మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు 904 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చను న్నారు.మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా.. ఇప్పటివరకు ఆరు దశల్లో 486 సీట్లకు పోలింగ్ పూర్తయింది. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ తోపాటు ఏడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 56 స్థానాలకు చివరి విడతలో భాగంగా ఓటింగ్ కొనసాగుతోంది. పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటన్నింటికీ ఈ దశలోనే పోలింగ్ నిర్వహి స్తున్నారు. మాజీ సీఎం చరణ్‌జీత్‌సింగ్ చన్నీ, కేంద్ర మాజీమంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ తదితరులు వాటిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.