25.2 C
Hyderabad
Friday, February 14, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

పాల ప్యాకెట్ లో చీమలు

పాల ప్యాకెట్‌లో చీమలు వచ్చిన సంఘటన పెద్దపల్లి జిల్లా కరీంనగర్ డైరీలో చోటుచేసుకుంది. అభయ్ కుమార్ అనే వ్యక్తి పాల ప్యాకెట్ కొనుక్కోని ఇంటికెళ్లి తాగడానికి తీయగా అందులో చీమలు దర్శనమి చ్చాయి. దీంతో అతను వెంటనే డైరీ యజమాన్యం దగ్గరికి వెళ్లి అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన ట్లు వాపోయాడు. కరీంనగర్ డైరీపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటలం ఆడుతున్న వారిని ఉపేక్షించరాదని అధికారులను కోరాడు.

దళిత హనుమాన్ స్వాములు

సిద్దిపేట జిల్లా సీతారాం పల్లిలో దళిత స్వాములకు అవమానం ఎదురైంది. దళిత హనుమాన్ స్వామలు గుడిలోకి రావద్దని ఓ వర్గం స్వాములు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టారు.

తవ్వకాల్లో పురాతన పెట్టి లభ్యం

సిద్ధిపేట జిల్లా నరసాయపల్లి గ్రామంలో పురాతన పెట్టే బయటపడింది. రోజువారీగా ఉపాధి హామీ కూలీలు మట్టి తవ్వకాలు జరిపారు. ఈనేపథ్యంలోనే పురాతన పెట్టే బయటపడింది. అది తెరిచి చూడగా అందులో 20 వెండి నాణేలు, రెండు ఉంగరాలు లభించాయి. స్థానికుల సమాచారంతో అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఓయూ విద్యార్థి నాయకులను కలిసిన శ్రీనివాస్

రాజముద్ర, తెలంగాణ రాష్ట్ర గీతంలో చేస్తున్న మార్పులను తెలంగాణ విద్యార్థులు, ఉద్యమకారులుగా తాము స్వాగతిస్తున్నామన్నారు శ్రీనివాస్. గత పదేండ్ల బీఅర్ఎస్ పాలనలో అందరూ అణిచివేతలకు గురయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.

రోడ్డు ప్రమాదం

ములుగు జిల్లా ఏటూరునాగారం 163వ జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. రమేష్ అనే వ్యక్తి నేడు ఉదయం ఏటూరునాగారం 163 జాతీయ రహదారిపై వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జంపన్నవాగు 2వ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్ళింది. తీవ్రంగా గాయపడిన రమేష్‌ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు.

నకిలీ విత్తనాల అమ్మకంపై కొరడా ఝుళిపించిన పోలీసులు

వరంగల్ ఎరువుల దుకాణాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నకిలీ విత్తనాల ఇన్‌వైస్ అమ్మ కాలు జరపడం పై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ హెడ్ పోస్ట్‌ ఆఫీసు సెంటర్‌లో ఉన్న అన్ని ఎరువుల దుకాణాల్లో క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు నిర్వహించారు. ఎరువులు, విత్తనాల అమ్మకాలపై ఎలాంటి లోపాలున్నా సహించేది లేదని యజమాన్యాలను హెచ్చరించారు.

ఆత్మహత్యకు పాల్పడిన చిన్నారి

మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలంలో విషాదం నెలకొంది. నచ్చని హెయిర్ కటింగ్ చేయించార ని 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన కాంతారావు చిన్న కుమారుడు హర్షవర్ధన్ హాస్టల్లో ఉంటూ చదువుతుండగా వేసవి సెల వులకు ఇంటివద్దకు వచ్చాడు. తండ్రి ఇష్టం లేని హెయిర్ కటింగ్ చేయించాడని హర్షవర్ధన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

కార్డెన్ సెర్చ్

చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపల్ పరిధిలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్ నిర్వహించారు. మోడల్ కాలనీలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు, కుప్పం డిఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానితుల ఇళ్ళల్లో తనిఖీలు నిర్వహించారు. రికార్డులు లేని వాహనాలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

రౌడీ షీటర్ అరెస్ట్

బోరబండ రౌడీ షీటర్ సాయి కిరణ్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నాలుగు నేరాలు చేసాడు సాయి కిరణ్. వాటి తాలూకా కేసులు పెండింగ్ ఉండటంతో సాయికిరణ్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. సాయి కిరణ్ మధుర నగర్ పరిధిలోని బ్రహ్మ శంకర్ లో నివాసం ఉంటున్నాడు.

Latest Articles

గుంటూరు జిల్లాలో GBS సిండ్రోమ్ కలకలం

ఉమ్మడి గుంటూరు జిల్లాలో GBS సిండ్రోమ్ కలకలం రేపుతోంది. జిల్లా వ్యాప్తంగా ఏడు కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరో ఐదుగురు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్