తెలంగాణలో ఊరూరా చెరువు సంబురాలు.. పాల్గొన్న మంతులు, ఎమ్మెల్యేలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఊరూరా చెరువు సంబరాలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రాజ్యసభ సభ్యులు రెడ్డి వద్దిరాజు రవిచంద్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎంపీ నామా నాగేశ్వర రావు, చెరువు వద్ద బతకమ్మ ఆటపాట ఆడి సంబరాలకు మరింత ఆకర్షణగా నిలిచారు.

మరోవైపు హనుమకొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చెరువుల పండగ సందర్భంగా భద్రకాళి చెరువు దగ్గర బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చెరువుల పండుగను పురస్కరించుకొని వరంగల్ లోని కరీమాబాద్ ఉరుసు రంగసముద్రం చెరువు దగ్గర పూజలు చేసిన అనంతరం రంగలీల మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సిపి ఏవి రంగనాథ్, నగర మేయర్ గుండు సుధారాణి, MLC బస్వరాజు సారయ్య,జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య,  GWMC కమిషనర్ రిజ్వన్ బాషా పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక  ప్రదర్శన అలరించింది.

అటు సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం రాజగోపాల్ పేట గ్రామంలో ఊరూరా చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. చెరువు దగ్గరికి చేరుకున్న మంత్రికి డప్పులు, బోనాలు జలపందిరితో గ్రామస్తులు స్వాగతం పలికారు.

Latest Articles

ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..

బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్