రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. గవర్నర్ కు టీడీపీ విన్నపం

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నేతలు అన్నారు. గురువారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ షరీఫ్, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్రలు గవర్నర్ ని కలిశారు. ఈ సంధర్బంగా యువగళం పాదయాత్రలో వైసీపీ నేతలు సృష్టిస్తున్న అడ్డంకులు, పోలీసులు వ్యహరిస్తున్న తీరు, రాష్ట్రంలో మైనార్టీలపై జరుగుతున్న దాడుల అంశాల్ని గవర్నర్ కు నివేదించారు.

అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ…..వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు కుంటుపడ్డాయి, ప్రజాస్వామ్యం లేదు, ప్రజలకు కనీసం మాట్లాడే స్వేచ్చ లేదు. ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ వర్గాలపై గత నాలుగేళ్లలో జరిగిన దాడులు గతంలో ఎన్నడూ జరగలేదు. మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు వంటి ఘటనలకు 50 పైకి జరిగాయి. ఇవన్నీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి వీటిపై కమిటీ వేసి విచారణ జరపమని కోరాం. మరో వైపు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోంది.

టీడీపీ కార్యక్రమాలు జరిగే చోట వైసీపీ ప్లెక్సీలు కట్టి సైకోలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం ఉంటే అదే రోజు మరో పార్టీ ప్లెక్సీలు కట్టి కవ్వింపు చర్యలకు పాల్పడటం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? మహానాడు జరిగిన రాజమండ్రిలో వైసీపీ ప్లెక్సీలు కట్టారు. చంద్రబాబు, లోకేశ్ లపై అసభ్య పదజాలం వాడుతూ… పాదయాత్రలో ప్లెక్సీలు కట్టి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ గవర్నర్ కు విన్నవించుకున్నారు.

Latest Articles

ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..

బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్