31.2 C
Hyderabad
Sunday, May 26, 2024
spot_img

12 రాశుల వారి రాశిఫలాలు..

స్వతంత్ర, వెబ్ డెస్క్:

మేషం
మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. మితిమీరిన ఔదార్యంతో ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో సహచరుల పనులను కూడా మీరే పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు. ఈశ్వర నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

వృషభం
ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు బాగా ఆదరిస్తారు. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్థిస్తారు. కుటుంబంలో కొద్దిగా చికాకులు తలెత్తుతాయి. సంతానం పురోగతి సాధిస్తారు. ఖర్చుల్ని బాగా తగ్గించుకోవాలి. బుద్ధిబలంతో కొన్ని వ్యవహారాలలో సమస్యలను అధిగమించగలుగుతారు. మనఃస్సౌఖ్యం ఉంది. మనోల్లాసం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. బంధువులతో వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

మిథునం
కొత్త ఆశయాలతో పనులను ప్రారంభిస్తారు. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు శ్రమ మీద మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకుంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సమస్య ఒకటి బంధువుల సహకారంతో పరిష్కారం అవుతుంది. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శివనామస్మరణ శుభప్రదం.

కర్కాటకం
కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. వ్యాపారులకు అన్ని విధాల కలిసి వస్తుంది. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పరిచయస్తులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. ఇష్టదైవ ప్రార్ధన శ్రేయస్కరం.

సింహం
వ్యాపారులకు ఆర్థికంగా పర్వాలేదు. వృత్తి నిపుణులు నిలదొక్కుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కి అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. రుణ సమస్య తగ్గుతుంది. పెళ్లి సంబంధం కాయం అవుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధంకుదురుతుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. సంతోషంగా గడుపుతారు. ముఖ్య విషయంలో అనుకున్నది దక్కుతుంది. అర్థలాభం ఉంది. శ్రీలక్ష్మీధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

కన్య
ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఐటీ రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా ఆశాజనకంగా ఉండదు. ఎవరికీ వాగ్దానాలు చేయకండి. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొందరు బంధువులు ఇబ్బంది పెడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి ఆర్థిక సాయం అందుతుంది. బంధుప్రీతి ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

తుల
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇతరులకు బాగా సహాయపడతారు. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. రాదనుకున్న డబ్బుచేతికి వస్తుంది. స్నేహితులు అండగా నిలుస్తారు. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో కొద్దిగా లాభాలు సంపాదిస్తారు. ఇరుగుపొరుగుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ముందుచూపుతో వ్యవహరించాలి. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

వృశ్చికం
ఉద్యోగంలో అధికారులు కొద్దిగా ఇబ్బంది పెడతారు. ఆదాయం పర్వాలేదు. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం నిలకడగా కొనసాగుతుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ధర్మసిద్ధి కలదు. బుద్ధిబలం బాగుంటుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్ట దైవ దర్శనం శుభప్రదం.

ధనస్సు
శుభకాలం. ఏ పనులు తలపెట్టినా త్వరగా పూర్తవుతాయి. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారి పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో మితిమీరిన శ్రమ, ఒత్తిడి ఉంటాయి. అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. ఆదాయంలో కొద్దిగా మాత్రమే పెరుగుదల ఉంటుంది. ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ఒకరిద్దరు స్నేహితులను ఆదుకుంటారు. పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు. సంతానం పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో విజయాలు సిద్ధిస్తాయి. ఇష్టదైవం ఆరాధన శుభప్రదం.

మకరం
ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. తిప్పట ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఒక బంధువు ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల వారికి సమయం బాగుంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. అయితే ఎక్కడా పెట్టుబడులు పెట్టవద్దు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి మంచి జరుగుతుంది.

కుంభం
మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఇంటా బయటా కొన్ని చికాకులు ఉన్నప్పటికీ ఏదో విధంగా నెట్టుకొస్తారు. ఆరోగ్యం పరవాలేదు. సన్నిహితులకు సహాయం చేస్తారు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. కొన్ని బకాయిలు వసూలు అవుతాయి. పెళ్లి సంబంధం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. ఇష్టదేవతారాధన శుభప్రదం.

మీనం
ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఊహించని విధంగా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. అనుకున్న పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
పెద్దల అశీస్సులు రక్షిస్తాయి. బంధు,మిత్రుల సహకారం లభిస్తుంది. కాలాన్ని మంచి విషయాల కోసం వినియోగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీదుర్గాధ్యానం శుభప్రదం.

Latest Articles

ముంచుకొస్తున్న రెమాల్ తుఫాన్

రెమాల్ తుఫాను దూసుకొస్తోంది. బెంగాల్‌, అస్సోం, మేఘాలయలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. తుఫాను కారణంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేసి, విమాన రాకపోకలు నిలిపివేస్తు న్నారు. బంగాళాఖాతంలో రెమాల్‌ తుఫాన్‌ బలపడింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్