స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ మంత్రి అమర్నాథ్ సవాల్ విసిరారు. విస్సన్నపేట భూములపై చంద్రబాబు సవాల్ ను స్వీకరించిన మంత్రి.. ప్రతిసవాల్ విసిరారు. నా పేరు మీద కానీ.. కుటుంబ సభ్యుల పేరు మీద కానీ అరసెంటు ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఈ ఆరోపణలు రుజువు చెయ్యలేకపోతే లోకేష్ ను రాజకీయాల నుంచి తప్పిస్తావా? అంటూ ప్రశ్నించారు. తప్పు చేయాలిసి వస్తే నడిరోడ్డుపై ఉరేసుకుంటానే తప్ప.. ధర్మం తప్పను అని వ్యాఖ్యానించారు. రూ.2000 నోట్లు రద్దు సలహా నాదేనని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం అని అన్నారు. మొదటగా పెద్ద నోట్ల రద్దును ఆహ్వానించిన చంద్రబాబు.. బీజేపీతో తెగతెంపులు అవ్వగానే తుగ్లక్ చర్యగా మాట్లాడటం గుర్తు చేసుకోవాలన్నారు.
తప్పు చేయాల్సి వస్తే నడిరోడ్డుమీద ఉరేసుకుంటా: అమర్నాథ్
0
294
Previous article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


