YS Sharmila: కేసీఆర్ ను చూసి ఓటెయ్యండని ఎలా అడుగుతున్నారు?- వైఎస్ షర్మిల

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. ఉద్యోగాలు లేక ప్రవల్లిక లాంటి అమ్మాయి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడుతుంటే.. కేసీఆర్ ను చూసి ఓటెయ్యండని ఎలా అడుగుతున్నారు కేటీఆర్ గారూ? అని ప్రశ్నించారు. ఉద్యోగం సాధించి వస్తానమ్మా అని పట్నం వెళ్లిన బిడ్డ విగతజీవిగా వస్తే ఆ తల్లిదండ్రుల గుండె కోత ఎలా ఉంటుందో తెలుసా మీకు? అని మండిపడ్డారు. ప్రవల్లికది ఆత్మహత్య కాదని.. మీ బీఆర్ఎస్ సర్కార్ చేసిన హత్య అని ఆరోపించారు.

నష్ట జాతకురాలు ప్రవల్లిక కాదని.. అన్ని అధికారాలున్నా నిరుద్యోగుల కోసం ఏం చేయలేని పాలకులు నష్ట జాతకులని షర్మిల అన్నారు. ఉద్యోగాలకు సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాలేదు… ఒక్క పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించడం చేతకాలేదు… ఏం చూసి మిమ్మల్ని మళ్లీ ఎన్నుకోవాలి? అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేసినందుకా.. నిరుద్యోగ భృతి అని దొంగ హామీ ఇచ్చినందుకా.. అంగట్లో సరుకుల్లా TSPSC పేపర్లు అమ్ముకున్నందుకా.. ఎందుకు మీకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. పేపర్ లీకులు, పరీక్షల వాయిదాలు, కేసులు, కోర్టులు.. మీ పాలనలో నిరుద్యోగుల దుస్థితి ఇదని అన్నారు. గద్దెనెక్కిన నాటి నుంచి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగం లేక ప్రాణాలు తీసుకుంటున్న చెట్టంత బిడ్డని కోల్పోతున్న ఆ తల్లిదండ్రుల ఉసురు మీకు, మీ సర్కార్ కు తగలక మానదని అన్నారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్