దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ జారీచేశారు. కాసేపట్లో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్(Kejriwal) సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా సీబీఐ కార్యాలయానికి వెళ్లనున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. లిక్కర్ స్కాంలో ఇవాళ విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. కాగా ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavita)ను మూడు సార్లు ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్(Sukesh ChandraSekhar) ఎమ్మెల్సీ కవితతో చేసిన వాట్సాప్ చాట్ ను బయటపెట్టగా.. త్వరలోనే కేజ్రీవాల్ తో చేసిన సంభాషణను కూడా విడుదలు చేస్తానని ప్రకటించాడు.
Also Read: మోదీకి రూ.1000కోట్లు ఇచ్చా..అరెస్ట్ చేస్తారా?: కేజ్రీవాల్