ఎందుకు చిప్స్ ప్యాకెట్లలో గాలి నింపి ఉంటుంది? అసలు నిజం ఇదే!

మనకు ఇష్టమైన చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసి తెరిచినప్పుడు అందులో సగం వరకు మాత్రమే చిప్స్ ఉండి, మిగతా భాగం మొత్తం గాలితో నిండిపోయి ఉండటం చూసి చాలా మందికి నిరాశ కలుగుతుంది. “ఇంత పెద్ద ప్యాకెట్‌లో ఇంత తక్కువ చిప్సా?” అని అనిపించడం సహజం. దీంతో చాలా మంది చిప్స్ కంపెనీలు వినియోగదారులను మోసం చేస్తున్నాయా అనే సందేహం వ్యక్తం చేస్తుంటారు.

అయితే, కంపెనీలు మాత్రం ప్యాకెట్‌లో గాలి నింపడానికి సరైన శాస్త్రీయ కారణం ఉందని చెబుతున్నాయి. ముఖ్యంగా ఆ గాలి సాధారణ గాలి కాదు… అది నైట్రోజన్ గ్యాస్.

నైట్రోజన్ ఎందుకు ఉపయోగిస్తారు?

చిప్స్ ఎక్కువకాలం తాజాగా ఉండేందుకు, అవి పాడవకుండా కాపాడేందుకు ప్యాకెట్లలో నైట్రోజన్ నింపుతారు. సాధారణ గాలిలో ఉండే ఆక్సిజన్ చాలా రియాక్టివ్‌గా ఉంటుంది. అది ఇతర పదార్థాలతో త్వరగా ప్రతిస్పందించి రసాయన మార్పులు కలిగిస్తుంది. దీంతో చిప్స్ పాడవడం, వాసన మారడం లేదా మెత్తబడిపోవడం జరుగుతుంది.

కానీ నైట్రోజన్ మాత్రం స్థిరమైన, స్పందించని గ్యాస్. అందువల్ల చిప్స్ తాజాదనాన్ని ఎక్కువకాలం నిల్వ ఉంచడంలో ఇది సహాయపడుతుంది. దీనివల్ల కృత్రిమ ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా వాడాల్సిన అవసరం కూడా తగ్గుతుంది.

chips

చిప్స్ షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది

పలు చిప్స్ తయారీ సంస్థల ప్రకారం, నైట్రోజన్ వాడటం వల్ల చిప్స్ సుమారు 40 నుంచి 55 రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… మనం పీల్చే గాలిలో దాదాపు 78 శాతం నైట్రోజన్ ఉంటుంది. కాబట్టి ఈ గ్యాస్ వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి హానీ ఉండదు.

గాలి మరో విధంగా కూడా ఉపయోగపడుతుంది

చిప్స్ చాలా సులభంగా విరిగిపోయే స్వభావం కలిగి ఉంటాయి. తయారీ కేంద్రం నుంచి దుకాణాల వరకు రవాణా సమయంలో ప్యాకెట్లకు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ప్యాకెట్‌లో నింపిన గాలి ఒక “కుషన్”లా పనిచేస్తుంది. దీంతో చిప్స్ ఎక్కువగా విరగకుండా కాపాడబడతాయి. ఈ ప్రక్రియను ప్రపంచవ్యాప్తంగా “స్లాక్ ఫిల్” (Slack Fill) అని పిలుస్తారు.

chips

ప్యాకెట్‌పై బరువు స్పష్టంగా ఉండాలి

భారతదేశంలోని Standards of Weights and Measures Act, 1976 , Packaged Commodities Rules, 1977 ప్రకారం తయారీదారులు తమ ఉత్పత్తిలోని అసలు బరువును ప్యాకెట్‌పై స్పష్టంగా పేర్కొనాలి. చిప్స్ ప్యాకెట్లలో లోపలి, బయట భాగాల నుంచి ఎలాంటి నష్టం కలగకుండా కాపాడేందుకు గాలి నింపే ఈ ప్రక్రియ గురించి కంపెనీలు వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలి. అలాగే గాలిని మినహాయించి చిప్స్ అసలు బరువును ప్యాకెట్‌పై స్పష్టంగా పేర్కొనాలి.

అయితే చాలా సందర్భాల్లో వినియోగదారులు పెద్ద ప్యాకెట్ అంటే ఎక్కువ చిప్స్ ఉంటాయని భావిస్తారు. అందుకే ప్యాకేజింగ్ విషయంలో మరింత పారదర్శకత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గాలిని మినహాయించి అసలు చిప్స్ బరువును వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలని అభిప్రాయపడుతున్నారు.

 

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్