- జూబ్లీహిల్స్‌లోని విద్యాసాగర్‌రావు నివాసానికి వెళ్లిన దత్తన్న
- వర్తమాన అంశాలపై సీనియర్ నేతల సమాలోచనలు

మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సమావేశమయ్యారు. విద్యాసాగర్ రావు ఆహ్వానం మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి లంచ్ మీట్‌కి హర్యానా బండారు దత్తాత్రేయ వెళ్లారు. విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ పలు వర్తమాన అంశాలపై చర్చించినట్లు సమాచారం.