తెలంగాణలో మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు పీక్స్ కి చేరాయి. సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ని స్వీకరించారు మాజీ మంత్రి హరీశ్‌రావు. రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసివేస్తారా అన్న రేవంత్‌కు హరీశ్‌రావు కౌంటరిచ్చారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందన్నారు. ఎల్లుండి అసెంబ్లీ ముందు అమర వీరుల స్థూపం వద్దకి తాను వస్తానని చెప్పారు. అక్కడ ఆగస్ట్ 15లోపు అన్ని గ్యారంటీలు అమలు చేస్తానని రేవంత్ ప్రమాణం చేయాలన్నారు. ఆగస్ట్ 15లోపు రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. మళ్లీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయనన్నారు హరీశ్ రావు. ఒకవేళ హామీలను నెరవేర్చకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.