పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సాంగ్ సూపర్ డూపర్ హిట్టే. అవును.. గతంలో అత్తారింటికి దారేది సినిమా సీన్స్ లీకైతే.. సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే ఇప్పుడు కూడా పవన్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా నుంచి సాంగ్ లీకయ్యింది. అంటే అది కూడా సూపర్ హిట్టే కదా.
ఈ పాటికి “మాట వినాలి గురుడా మాట వినాలి.. మాట వినాలి మంచి మాట వినాలి”..అనే సాంగ్ రిలీజ్ కావాలి. 6వ తేదీన రావాల్సిన ఈ పాట ఇంత వరకు రాలేదు. ఇవాళ లేదా రేపు ఈ సాంగ్‌పై ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రకటన రాలేదు కానీ సాంగ్ మాత్రం లీక్ అయింది.
అక్షరాల ఇది పవన్ కళ్యాణ్ పాడిన సాంగ్. చేతిలో కంజర పట్టుకొని స్వయంగా పవన్ ఆలపించిన పాట ఇది. “మాట వినాలి గురుడా మాట వినాలి.. మాట వినాలి మంచి మాట వినాలి”..అనే లిరిక్స్‌తో జానపద శైలిలో పవన్ పాడిన ఈ పాట ఇప్పుడు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది.
పాట లీక్ అవడంతో వీలైనంత త్వరగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. రేపు ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈనెల 18న లిరికల్ వీడియోని విడుదల చేసే చాన్స్ ఉందట.
హరిహరవీరమల్లు సినిమాకి జ్యోతికృష్ణ డైరెక్టర్. కొంత భాగం మాత్రమే షూటింగ్ పార్ట్ మిగిలింది. మార్చి 28న హరిహర వీరమల్లు పార్ట్1 రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.