లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 136పరుగుల స్వల్ప లక్ష్యం ఛేదించలేక లక్నో జట్టు ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టుకు ఆదిలో మంచి శుభారంభం లభించింది. అయితే త్వరత్వరగా వికెట్లు పడడంతో 20ఓవర్లలో 6వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ సాహా(47), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(66) పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో స్టాయినిస్, కనాల్ పాండ్యా తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన లక్నో జట్టు ఛేదనలో తడబడింది. కెప్టెన్ రాహుల్(68), మేయర్స్(24) పరుగులతో రాణించినా మిగతా బ్యాటర్లు విఫలమవ్వడంతో నిర్ణీత ఓవర్లలో 128/7 రన్స్ మాత్రమే చేసింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో టైటాన్స్ జట్టు పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది.
లో స్కోరింగ్ మ్యాచ్‌లో లక్నోపై గుజరాత్ గెలుపు
0
381
Previous article
Latest Articles
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఫకృద్ధీన్ పాలెం గ్రామంలో రూ. 73 లక్షల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మైసమ్మ చెరువు, వాకింగ్ ట్రాక్,...
- Advertisement -
- Advertisement -


