మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. వివేకా రెండో భార్య షమీమ్ వాంగ్మూలం నేపథ్యంలో సీఆర్పీసీ 160కింద ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీంతో శనివారం సాయంత్రం విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి వచ్చారు. వివేకా హత్య జరిగిన ఘటనా స్థలంలో దొరికిన లేఖపై రాజశేఖర్ రెడ్డిని అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సీబీఐ విచారణ ముగియడంతో ఆయన తన ఇంటికి వెళ్లిపోయారు. ఈ కేసులో ఇప్పటికే భాస్కర్‌రెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డిలతో పాటు ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ.. ఇప్పుడు వివేకా అల్లుడిని కూడా విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని విచారించిన సీబీఐ
0
305
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


