తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల తరఫున బీఆర్‌ఎస్ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రతి యేడాది ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగులు భర్తీ చేస్తామని మరి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని నిలదీశారు. గ్రూప్-1,గ్రూప్-2, మెగా డీఎస్సీ ఇప్పటి వరకు ఎందుకు వేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందిం చకపోతే నిరుద్యోగుల తరఫున పోరాడటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. అంతకు ముందు హైద రాబాద్‌లో కేటీఆర్‌ను గ్రూప్-1, డీఎస్సీ అభ్యర్థులు కలిశారు.
హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసిన గ్రూప్-1, డీఎస్సీ అభ్యర్థులు
0
258
Previous article
Next article
Latest Articles
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -
- Advertisement -


