విజయవాడ బుడమేరు వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సేవలు అందిస్తుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లని బోట్ల ఢీకొన్న ఘటన పై ప్రభుత్వం విచారణ చేస్తోందన్నారు. జాతీయ విపత్తుగా నిర్ణయించాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయన్నారు. వాటికి అనుగుణంగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. వరదల్లాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామంటున్న సుజనా చౌదరి.