వైసీపీ నేతలు విమర్శలు మాని సహాయక చర్యల్లో పాల్గొనాలని హితవు పలికారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మూడు రోజుల నుంచి తాను కనిపించడంలేదని విమర్శిస్తున్న వైసీపీ నేతలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. సహాయక చర్యలకు ఇబ్బందులు కలగకూడదనే తాను వరద సహాయక చర్యల్లో పాల్గొనలేదని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వైసీపీ నేతలు ముందు సాయం చేసి మాట్లాడాలని ఆయన చురకలింటించారు. ఇళ్లల్లో కూర్చొని విమర్శిస్తామంటే అది పద్ధతి కాదని..బయటికొచ్చి సహాయకచర్యల్లో పాల్గొంటే తాము కూడా సహకరిస్తామని పవన్ చెప్పారు.