గుడ్ న్యూస్.. కాపు నేస్తం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్

స్వతంత్ర వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లాకు చేరుకోనున్నారు. నిడదవోలులో వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులు విడుదల చేయనున్నారు. ఈ ఉదయం పది గంటలకు నిడదవోలు చేరుకుని.. రోడ్‌ షో ద్వారా సభాస్థలికి వెళ్లనున్నారు. సభలో బటన్‌ నొక్కడం ద్వారా వైఎస్ జగన్ వైయస్సార్ కాపు నేస్తం నిధులు 3 లక్షలా 57 వేల మందికి పైగా మొత్తం 537 కోట్ల రూపాయల నిధులను అందించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లికి బయల్దేరుతారు.. సీఎం పర్యటన నేపథ్యంలో నిడదవోలులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభాస్థలి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.

వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్నవారికి ప్రభుత్వం 15 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తోంది. ఏటా 15 వేల చొప్పున ఐదేళ్లలో 75 వేల ఆర్థిక సాయం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.. ఇందులో ఇప్పుడు నాలుగో విడత అందిస్తున్నారు.. ఇవాళ అందజేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు ఈ పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లవుతుందని జగన్ ప్రభుత్వం వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వం 52 నెలల్లో 77 లక్షల మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించింది.

Latest Articles

బేగంపేట్ రైల్వేస్టేషన్‌లోకి వర్షం నీరు

హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి బేగంపేట్‌ రైల్వే స్టేషన్ లోపలకు వర్షం నీరు చేరింది. వర్షం నీళ్లు లోపలికి చేరడంతో ప్రయాణికులు, స్టాఫ్ ఇబ్బందులు పడ్డారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్