పోలీసులు ఎన్ని తనిఖీలు చేపడుతున్నా.. గంజాయి దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్ నగరంలోని బాలానగర్‌లో భారీగా గంజాయి చాక్లెట్లు లభ్యమయ్యాయి. ఒడిశాకు చెందిన అనంత కుమార్ బాలనగర్ లో ఓ చిన్న కిరాణా షాపును నిర్వహిస్తున్నాడు. నిత్యావసర సరుకులతో పాటు గంజాయి చాక్లెట్లను కూడా విక్రయిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు బాలా నగర్ ఎస్‌వోటీ పోలీసులు కిరాణా షాపుపై దాడి చేశారు. తనిఖీల్లో భాగంగా షాపులో మూడు ప్యాకెట్లలో 125 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా నిందితుడు అనంత కుమార్ గంజాయి చాక్లెట్లను ఒడిశా నుంచి హైదరాబాద్‌లోని బాలానగర్ ప్రాంతానికి తీసుకొచ్చి కూలీలకు, విద్యార్థులకు అమ్ముతునట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ బాలనగర్‌లో గంజాయి చాక్లెట్లు కలకలం
0
302
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


