Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

వనరులున్నా అభివృద్ధి చెందని ఒంగోలు నియోజకవర్గం

    విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయ్యే అవకాశం తృటిలో తప్పిపోయింది. అంతే కాదు.. హేమాహేమీల్లాంటి నేతలు ఇక్కడ్నుంచి ప్రాతినిథ్యం వహించినా నియోజకవర్గం అభివృద్ధి విషయంలో చేసింది అంతంత మాత్రమేనన్న విమర్శలున్నాయి. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా… సహజసిద్ధ వనరులు న్నా.. ఓ వెలుగు వెలగాల్సిన ఒంగోలు పరిస్థితి.. ఇప్పుడు మిణుకుమిణుకు మంటోందన్న వాదన బలంగా విన్పిస్తోంది. అభివృద్దికి ఎంతో అవకాశం ఉన్నా.. అన్ని రకాలుగా వెనుకపడిన ఒంగోలు నియోజ కవర్గానికి చెందిన వివారాల్లోకి వెళదాం.

   ఒంగోలు నియోజకవర్గానికి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. ఒంగోలు పట్టణానికి దగ్గరలోనే తీర ప్రాంతం ఉంది. చెన్నై, కోల్‌కతా ప్రధాన రైలు మార్గాలున్నాయి. సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆగుతాయి. ఇంకా చెప్పాలంటే ప్రకాశం జిల్లాలోనే రవాణా వ్యవస్థకు కేంద్ర బిందువుగా ఉంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒంగోలు గిత్తలున్నాయి. నిజానికి రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా ఒంగోలు అయితే బాగుంటుందని శ్రీ కృష్ణ కమిటీ తేల్చి చెప్పింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. అంతేకాదు ఏపీ మొత్తానికి సరిగ్గా మధ్యలో ఉందంటూ శ్రీకృష్ణ కమిటీ నివేదిక సైతం ఇచ్చింది. అయితే.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా పరిస్థితులు మారాయన్న వాదన విన్పిస్తోంది.

     ఒంగోలు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు ఉపఎన్నికలతో కలిపి 17సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఏడుసార్లు, తెలుగుదేశం నాలుగుసార్లు, ఉపఎన్నికతో కలిపి వైసీపీ రెండుసార్లు, కమ్యూనిస్టులు ఒకసారి, ఇండిపెండెంట్లు మూడుసార్లు విజయం సాధించారు. జిల్లాలో చాలా నియోజక వర్గాలు ఉన్నప్పటికీ ఒంగోలు కేంద్రంగానే జిల్లా రాజకీయాలు నడుస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్నింటికీ ఒంగోలు పట్టణమే కేంద్ర బిందువుగా కన్పిస్తుం ది.

    ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడి నుంచి ఐదు సార్లు విజయం సాధించారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. దీంతో ఆయన పేరుపైనే ప్రకాశం జిల్లాగా నామకరణం చేశారు. అయితే.. ఆ తర్వాతి కాలం లోనూ హేమాహేమీల్లాంటి నేతలు జిల్లా నుంచి వచ్చారు. పలువురు ముఖ్యమంత్రుల కేబినెట్‌లో కీలక శాఖలు నిర్వహించారు. వంగోలు రాజులు పరిపాలించడంతో పట్టణానికి అదే పేరు స్థిరపడింది. కాల క్రమంలో వంగోలు కాస్తా ఒంగోలుగా మారిపోయింది. 1972లో గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి విడిపోయి ప్రకాశం జిల్లా కొత్తగా ఏర్పడింది. ఇక, నియోజకవర్గంలో ఉన్న మండలాలను గమనిస్తే.. ఒంగోలు, కొత్తపట్నం, ఒంగోలు రూరల్ మండలాలున్నాయి. నియోజకవర్గ జనాభా విషయానికి వస్తే… ఒంగోలు నియోజకవర్గంలో 2 లక్షల 36 వేల 292 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషుల సంఖ్య లక్షా 13 వేల 702 మంది…మహిళలు లక్షా 22 వేల 549 మంది. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పరంగా చూస్తే ప్రకాశం జిల్లా 13వ స్థానంలో ఉంది.

     కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు, ఒంగోలు నియోజకవర్గం వెనుకపడి పోవడానికి ఎన్నో కారణాలున్నాయి. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు. ఎవరూ కూడా సమస్యలని పట్టించుకో లేదనే విమర్శలున్నాయి. అంతేకాదు ప్రకాశం జిల్లాకి హెడ్ క్వార్టర్ గా ఉన్న ఒంగోలు పట్టణం ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.

    ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒంగోలు గిత్తలు ఇక్కడే ఉన్నాయి. ఇవి ప్రత్యేకమైన జేబూ జాతికి చెందినవి. కాకపోతే మన దగ్గర తరిగిపోతున్నాయి. బ్రెజిల్ దేశంలో వెలిగిపోతున్నాయి. దాని వెనుక ఒక వాస్తవ కథ ఉంది. ఇందుకు సంబంధిం చిన ఓ కథ ప్రచారంలో ఉంది. అది 1868 వ సంవత్సరం. భారతదేశం నుంచి ఇంగ్లండ్‌కు ఒక ఓడ బయలుదేరింది. అందులో విక్టోరియా మహారాణి కోసం పంపిస్తున్న కొన్ని విలువైన బహుమతులున్నాయి. అయితే అనుకోకుండా ఆ ఓడ బ్రెజిల్ తీరానికి చేరుకుంది. విక్టోరియా మహారాణి కోసం పంపిన బహుమతులను అక్కడ అమ్మేశారు. ఆ బహుమ తులే.. రెండు ఒంగోలు జాతి పశువులు. ఆ విధంగా బ్రెజిల్ గడ్డపై ఒంగోలు జాతి ప్రస్థానం ప్రారంభమైంది. రెండింటితో మొదలై ఇప్పుడు కొన్ని కోట్లకు చేరుకుంది. వాళ్లు కాపాడుకుంటున్నారు. మనం భారాన్ని మోయలేకపో తున్నాం. బ్రెజిల్‌లో దాదాపు 43 కోట్ల ఎకరాల గడ్డి భూములున్నాయి. అంటే సగటున ఒక్కో ఒంగోలు గిత్తకు సుమారు రెండెకరాల భూమి ఉంది. అందువల్ల పోషణ సులువు అయ్యింది. ఇక అక్కడ నుంచి ఒంగోలు గిత్తలు ప్రపంచమంతా విస్తరిం చాయి. అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మెక్సికో, ఇండోనేషియా, మారిషస్, కొలంబియా, మలేసియా ఇలా పలుదే శాలకు ఒంగోలు జాతి విస్తరించింది.

      ఒంగోలు పరిధిలో మేలుజాతి వర్జీనియా పొగాకు సాగు చేస్తారు. దేశ విదేశాలకు ఇక్కడ నుంచి ఎగుమతులు జరుగుతుంటాయి. కందుకూరు-1, కందుకూరు-2, కనిగిరి, డీసీపల్లి, ఒంగోలు-1, ఒంగోలు-2, పొదిలి, కనిగిరి, కొండెపి, వెల్లంపల్లి, టంగుటూరు వేలం కేంద్రాల పరిధిలో 2022-23 సీజన్‌ లో పొగాకు బోర్డు 89.35 మిలియన్‌ కిలోల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించారు. రైతులు మాత్రం 122.34 మిలియన్‌ కిలోలను పండించారు. అధికంగా పండించిన పొగాకు వేలం కేంద్రాల్లో అమ్ముకోవాలంటే 5 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ చొరవతో నష్టం లేకుండా అమ్ముకునేందుకు జగన్ సర్కారు అనుమతించింది. అంతర్జాతీయ విపణిలో పొగాకు రేట్లు స్థిరంగా ఉండవని, రైతులు ఎక్కువగా పంట వేయవద్దని ట్రేడింగ్ విశ్లేషకులు చెబుతున్నారు.

     ఓవైపు నుంచి ఒంగోలు గిత్తలు అంతరించి పోతున్నాయి. వాటిని సంరక్షించే వారు లేరు. వాటి పోషణ.. నిర్వహించే వారికి భారంగా మారింది. కానీ, ఇంత జరుగుతున్న ప్రభుత్వాలు స్పందించింది మాత్రం శూన్యమనే చెప్పాలి. మరోవైపు ఇక్కడ పుట్టిన ఒంగోలు గిత్తలు ఇతర దేశాల్లో విస్తరించడాన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి అంటున్నారు. అటు.. ఒంగోలు నగరం విద్యలకు, పలువురు ప్రముఖులకు నెలవనే చెప్పాలి.

    భరద్వాజ మహర్షి వేద విద్యా మండలి ఒంగోలులోనే ఉంది. దీనిని అలూరి సీతారామమ్మ-రామకోటేశ్వరరావు పాఠశాలగా కూడా పిలుస్తారు. ఉన్నత విద్యాలయాలతో సరస్వతీ నిలయంగా ఒంగోలు పట్టణం పేరు ప్రఖ్యాతులు పొందింది. ఇక్కడ వేదవిద్యను నేర్పిస్తారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, QIS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ, పేస్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, దామచర్ల సక్కుబా యమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వంటి కాలేజీలు ఒంగోలులో వున్నాయి. శర్మ కాలేజీ ఇక్కడ ప్రధానమైనది. హీరో చిరంజీవి, దర్శకుడు టి. కృష్ణ, నవతరం బాబూరావు, ఎంవీఎస్ హరనాథరావు, ముత్యాల సుబ్బయ్య తదితర సినీ ప్రముఖులు ఇక్కడ శర్మ కాలేజీలో చదువుకున్నవారే. వీరిలో పలువురు ప్రజా నాట్యమండలి నుంచి వచ్చి సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అందుకే అందరిలో విప్లవభావాలు ఎక్కువగా ఉంటాయి. వీరికన్నా ముందు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వారిలో అలనాటి హీరోయిన్ కాంచన, భానుమతి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొంగర జగ్గయ్య, జి. వరలక్ష్మి లాంటివారు ప్రకాశం జిల్లా వాసులు కావడం విశేషం. సినీ పరిశ్రమతో ఇక్కడి వారికి ఉన్న అనుబంధ బాంధవ్యాల వల్ల ఎన్టీఆర్ కళాపరిషత్..ఒంగోలు ఆధ్వర్యంలో ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్త నాటకోత్సవాలు ఘనంగా జరుగుతాయి.

     2014లో ఆమోదించిన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యరూపం దాల్చలేదు. పర్యాటకంగా కొత్తపట్నం బీచ్ అభివృద్ధికి నోచుకోలేదు. కొత్తపట్నం, ఈత మొక్కల ప్రాంతాలలో ఆహ్లాదకరమైన తీర ప్రాంతం ఉంది. సెలవురోజుల్లో అక్కడ బీచ్ లు పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటాయి. పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్లు ఉన్నా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు నగరంలో పురాతన ప్రసిద్ది చెందిన చెన్నకేశవుల ఆలయం, ఇంకా ఒంగోలు కొండపై శ్రీ గిరి పుణ్యక్షత్రం ఉంది. వీటితో పాటు సాయిబాబా దేవాలయం ఉంది. బ్రిటిష్‌ కాలం నుంచి ఉన్న చర్చి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా చెప్పాలి. 1902 నుంచి దీపావళికి ముందు జరిగే నరకాసుర వధను ఇక్కడ ఘనంగా చేస్తారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి 22 వేల 245 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బాలినేనికి లక్షా ఒకవేయి 022 ఓట్లు రాగా సమీప తెలుగుదేశం అభ్యర్ధి దామచర్ల జనార్ధన్‌కి 78 వేల 777 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన షేక్‌ రియాజ్‌ కు 10వేల 304 ఓట్లు, నోటాకు పదమూడు వందల ముప్పై మూడు వచ్చాయి. మరి.. రానున్న ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. చేసేది గోరంత… చెప్పేది కొండంత అన్నట్లుగా ఒంగోలు నియోజకవర్గ పరిస్థితి మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాటలు చెప్పేవారే తప్ప, చేతల్లో చేసి చూపించేవారే లేరని ఇక్కడ ప్రజలు నిర్వేదంగా చెబుతున్నారు. మరి..ఒంగోలు నియోజకవర్గ ప్రజల పరిస్థితులు రాబోయే ఎన్నికలతోనైనా మారుతాయా ?

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్