జనసేనకు 24 సీట్లు ఇవ్వడంపై మాజీ మంత్రి హరిరామ జగయ్య ఫైర్ అయ్యారు. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అని ప్రశ్నించారు. జనసేన 24సీట్లకు మించి నెగ్గగలిగే స్తోమత లేదా.. అంటూ నిలదీశారు. జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అని ప్రశ్నించారు. ఈ పంపకం కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరిరామ జగయ్య. సీట్ల పంపకం మిత్ర పక్షాల మధ్య ఏ ప్రాతిపదికన చేశారని జోగయ్య తాజా లేఖలో ప్రశ్నించారు. జనసైనికులు సంతృప్తి చెందే విధంగా సీట్లు పంపకం ఉందా.. అని మండిపడ్డారు. జనసైనికులకు కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు…. పవన్ పరి పాలన అధికారం చేపట్టడమని తెలిపారు. గెలిస్తే పవన్‌ను రెండున్నరేళ్లు సీఎంగా ప్రకటించాలని పేర్కొన్నారు.
మాజీ మంత్రి హరిరామ జగయ్య ఫైర్….!!
0
386
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


