టీడీపీ-జనసేన పార్టీలు ఢిల్లీలో అమిత్ షాని కలిసినా, అమితాబ్ బచ్చన్‌ని కలిసినా తమకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. ఎన్నికలు అయ్యేవరకు అలా కలుస్తూనే ఉంటారని చెప్పారు. వారికి విధి విధానాలు ఏమీ లేవని తెలిపారు. మళ్లీ దోచుకు తినడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.టీడీపీ-జనసేన మధ్య జరిగిన సీట్ల సర్దుబాట్ల విషయం తమకు అనవసరమని బొత్స సత్యానారాయణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఏం చేశారని వారు ఓట్లు అడుగుతారని బొత్స సత్యనారాయణ నిలదీశారు. గతంలో వారు చేసిన మోసాలను చూసి ఓట్లు వేయాలని ప్రజలను అడుగుతారా అని ప్రశ్నించారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇచ్చారంటే ఆ పార్టీ నాయకుడికి ప్రజల్లో ఎంత విలువ ఉందో అర్థమవుతుందని అన్నారు.
బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి కామెంట్స్
0
299
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


