Diet Tips |డైటింగ్‌ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి..

Diet Tips |కాలం మారుతోంది.. జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులు.. ఆహారపు అలవాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాలంతో పాటు.. మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు చాలామంది. దీంతో జంక్ పుడ్స్ కు అలవాటు పడిపోయిన మనుషులు.. తమ ఆరోగ్యకరమైన జీవనం కోసం డైట్ పేరుతో ఆహార నియమాలు పాటిస్తున్నారు. చాలా మంది సరైన డైటింగ్ ప్లాన్స్ ను డబ్బులు పెట్టి మరీ కొనుక్కుంటున్నారు. అయితే చాలా మంది డైట్ చేస్తున్నా రిజల్ట్ రావడంలేదని బాధపడుతుంటారు. రోజూ డైటింగ్ చేసిన ఫలితం రాకపోవడానికి కారణం మనం చేసే డైట్ పై మనకు క్లారిటీ లేకపోవడమే అంటున్నారు నిపుణులు. డైటింగ్ చేసే వాళ్లు.. ఫస్ట్ ఎందుకోసం డైట్ చేస్తున్నారనే దానిపై స్పష్టత కలిగి ఉండాలి. బరువు తగ్గడం కోసం చేస్తున్నామా, అందం కోసం చేస్తున్నామా, శారీరక ధృడత్వం కోసం చేస్తున్నామా.. లేదా మరేదైనా దానికోసం చేస్తున్నామా అనే క్లారిటీ డైట్ చేసే వ్యక్తికి ఎంతో అవసరమంటున్నారు నిపుణులు.

Diet Tips |బరువు తగ్గడం కోసం డైట్ చేసే వాళ్లు ఈచిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఎక్కువుగా ఉన్న బరువును కొంత మేర తగ్గించుకోవాలనుకుంటే మొదట సరైన ఆహారం తీసుకోవాలి. బరువు తగ్గడానికి వ్యాయమం చేయాలి. వెంటనే ఫలితం ఆశించకూడదు. రోజూ డైట్ పాటిస్తే క్రమంగా శరీరంలో మార్పు కనబడుతుంది. మీరు డైట్ చేస్తున్నా ఫలితం రావడంలేదని బాధపడదచ్చు. కాని రిజల్ట్ రావడం లేదంటే డైట్ లో తగిన ఆహారాన్ని ఎంచుకోకపోవడమే కారణం. డైట్ లో ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ స్నేహితులు ఎవరైనా చేసే డైట్ నే మీరు ఫాలో అయితే.. అది ఫలితం చూపించకపోవచ్చు. శరీరాలను బట్టి ప్రాధాన్యతలు ఉంటాయి. అందుకే డైట్ చేసే ముందు శరీర సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుని తగిన ఆహారాన్ఇన ఎంచుకోవాలి.

ఇప్పటికే బరువు తగ్గేందుకు డైటింగ్ చేసినట్లయితే.. ఆసమయంలో ఎటువంటి ఆహారం తీసుకున్నాం, ఎలాంటి ఫలితం సాధించాం అనేది సమీక్షించుకోవాలి. మనకు నచ్చిన ఆహారం ఏమిటి.. నచ్చని ఆహారం ఏమిటి, ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటికి తగినట్లు మంచి ఆహారాన్ని ఎంచుకోవాలి. మనం చేసే డైట్ లో ఫస్ట్ మనకు ఇష్టమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. దాని ద్వారా రోజూ ఆ ఆహారాన్ని తీసుకోవడం సులభమవుతుంది. మనం ఎంచుకునే డైటింగ్ మన బడ్జెట్ కు తగిన విధంగా ఎంచుకోవాలి. మన జీవనశైలికి సరిపోయేలా ఉండాలి. ఎక్కువ భోజనం రెస్టారెంట్లలో తింటున్నామా.. ఇంట్లో తింటున్నామా అనేది డైట్ లో చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఎక్కువ ఇంట్లో వండిన ఆహారం తీసకోవడానికే ప్రాధాన్యమివ్వాలి. ఇష్టం లేని ఆహారాన్ని డైట్ లో చేరిస్తే ఎక్కువ కాలం డైటింగ్ కొనసాగించలేము. ఆరోగ్యకరంకాని ఆహారాన్ని డైట్ లో తీసుకోకూడదు. మీరు డైటింగ్ లో తీసుకునే ఆహారంతో ఏదైనా ప్రమాదముందా అనేది తెలుసుకోవాలి. డైట్ చేసే వాళ్లు ఏవైనా ఆరోగ్య సమస్యలు కలిగి ఉంటే.. ఎటువంటి ఆహారం తీసుకోవాలనే దానిపై వైద్యుదిని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి. పై చిట్కాలు పాటించడం ద్వారా మీరు చేసే డైట్‌ ద్వారా ఫలితం పొందవచ్చు.

 Read Also:  సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ విచారణ మరింత ఆలస్యం..

Follow us on:   Youtube   Instagram

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్