28.2 C
Hyderabad
Tuesday, May 28, 2024
spot_img

పొలిటికల్ సెటైరికల్ మూవీగా సాయికుమార్ ‘లక్ష్మీకటాక్షం’

ఇప్పటి వరకు తెలుగులో చాలా తక్కువ సెటైరికల్ కాన్సెప్ట్స్ వచ్చాయి. అందులోనూ పొలిటికల్ సెటైరికల్ కామెడీ సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకులని నవ్వించడానికి ‘లక్ష్మీకటాక్షం’ సినిమా రాబోతోంది. ఈ సినిమా నుంచి డైలాగ్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. రాజకియనాయకులు ఒక ఓటుకి ఇంత డబ్బులు అని నిర్ణయిస్తారు.. కానీ ఈ డైలాగ్ పోస్టర్‌లో ఓటరే తన రేటును తాను నిర్ణయించుకుంటాడు.

మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వస్తున్న ఈ “లక్ష్మీకటాక్షం : ఫర్ ఓట్” కు రచన, దర్శకత్వం సూర్య అందించారు. యు. శ్రీనివాసుల రెడ్డి నిర్మించగా.. అభిషేక్ రుఫుస్ సంగీతం అందించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకి చాలా ఆప్ట్‌గా ఉంది ఈ డైలాగ్ పోస్టర్. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రధాన పాత్రలో, వినయ్, అరుణ్, దీప్తి వర్మ మెయిన్ లీడ్స్‌గా చేస్తున్నారు. ఈ కథ నేపథ్యం మొత్తం తాడిపత్రిలో చిత్రీకరించినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే సరదాగా ఉండే టీజర్, ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.

నటీ నటులు:
వినయ్
అరుణ్
దీప్తి వర్మ
చరిస్మా శ్రీకర్
హరి ప్రసాద్
సాయి కిరణ్ ఏడిద
ఆమనీ

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: మహతి ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి
రచన, డైరెక్టర్: సూర్య
మ్యూజిక్: అభిషేక్ రుఫుస్
డి ఓ పి: నని ఐనవెల్లి
ఎడిటర్: ప్రదీప్ జే
సౌండ్ డిజైన్: మురళీధర్ రాజు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఆర్. రంగనాథ్ బాబు
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను , ధీరజ్- ప్రసాద్

Latest Articles

నేడు మాజీ ముఖ్యమంత్రి ఎన్.టీ.రామరావు 101వ జయంతి

   తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టీ.రామరావు 101వ జయంతి సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రజలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి శ్రద్ధాంజలి ఘటి స్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్