30.2 C
Hyderabad
Friday, June 21, 2024
spot_img

శ్రీరామనవమికి ముస్తాబవుతున్న భద్రాచలం

    దక్షిణాది ఆయోధ్యపురిగా పేరొందిన భద్రాచలం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబవుతోంది. జానకి రాముని కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవం జరిపించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతు న్నాయి. ఇక ఈ ఉత్సవాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు లక్షలాదిగా దేశం నలుమూలల నుంచి తరలిరానుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికా రులు.

  అందరి బంధువు అయిన శ్రీసీతారాముని పెళ్లికి ఊరంతా అతిధులే. అందుకే భద్రాద్రి రాములోరి కల్యాణ వేడుకకు భక్తులు ఇసుక వేస్తే రాలనంతగా పోటెత్తుతారు. శ్రీ రామనవమినాడుఅభిజిత్ లగ్నంలో జరిగే ఈ కళ్యాణ వైభవాన్ని కనులారా తిలకించి.. స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తుంటారు. దక్షిణాది ఆయోధ్యపురిగా పేరొందిన భద్రాచలంలో లోక కళ్యాణార్దం ప్రతి సంవత్సరం జరిగే జానకి పరిణయానికి దేశ నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. ఇక జానకి రాముని పరిణయ వేదికైన కల్యాణ మండపం ముస్తాబుతో సరికొత్త శోభను సంతరించుకుంది. శిల్పకళాశోభితమైన కళ్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు తిరుకళ్యాణ బ్రహోత్సవాలు ప్రారంభం కాగా,.. సోమవారం నుంచి ధ్వజరోహణంతో ఉత్సవ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నెల 17వ తేదిన అశేష భక్తజనుల కొలాహాలం నడుమ శ్రీసీతా రాముల కళ్యాణం జరుగనుంది. ఇక ఈవేడుక కోసం రామాలయం, మిథిలా స్టేడియం ప్రాంతాల్లో చలువ పందిళ్లు.. గోదావరి తీరంలో తాత్కాలిక షెడ్లు… అలాగే పట్టణంలో స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు.

  శ్రీసీతారామచంద్రస్వామి పరిణయ వేడుక కోసం నిర్మించిన కళ్యాణ మండపం ఓ శిల్ప కళాతోరణం. ఆనాడు రామదాసు చేయించిన ఆభరణాలతోనే ఇప్పటికీ పెళ్లి జరగటం ఓ ఆచారం. రామయ్యకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో విహాహం జరిపించాలనేది అప్పటి తానీషా శాసనం. ఆనాటి శాసనాలు నేటికి అమలు కావటం విశేషం. అయితే,.. ఈ కళ్యాణానికి ముందు ఉదయం 8.30 సమయంలో గర్బగుడిలోని మూలవరులకు కూడా కళ్యాణ తంతు నిర్వహించడం భద్రాచలం పుణ్యక్షేత్రంలో ప్రత్యేకత. ఈ తంతు ముగిసిన తర్వాతే ఉత్సవ మూర్తులను ప్రధాన ఆలయం నుంచి మిధిలా స్టేడియంకు తీసుకవచ్చి భక్తుల నడుమ కళ్యాణం నిర్వహిస్తారు. ఇక పరిణయ కళ్యాణమండపం 1960లో నిర్మించబ డినది. సుప్రసిద్ద శిల్పాచార్యులు ఎస్‌ఎం గణపతి స్ధపతి నేతృత్వంలో ఈ నిర్మాణం జరిగింది. తమిళ నాడులోని దిండవనం గ్రామం నుండి ఆకుపచ్చ ధాతురాయిని భద్రాచలం సమీపంలోని తాటాకుల గూడెం నుంచి నల్లరాయిని ఈ మండప నిర్మాణంలో వినియోగించారు.

   రామయ్య కళ్యాణానికి వాస్తవానికి శ్వేత అక్షింతలు వాడాలి. కానీ,.. శుభ సూచకంగా కొద్దిగా పసుపు కలుపుతారు. కాగా తానీషా ప్రభుత్వం తరపున రామయ్య కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలతో పాటు గులాం పొడిని వాడటంతో.. అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ కారణంగానే రాములోర కల్యాణ అక్షింతలు ఎరుపురంగు వర్ణంలో ఉంటాయి. ఈ తలంబ్రాలను బియ్యము, పసుపు, సుగంధం, గులాం, ఆవు నెయ్యితో కూడిన పంచ ద్రవ్యాలతో కలిపి తయారు చేస్తారు. ప్రత్యేక సుగంధ పరిమళాలు కలిపి తయారుచేసిన భద్రాద్రి సీతారాములు కళ్యాణ తలంబ్రాలను ప్రపంచవ్యాప్తంగా భక్తులు పవిత్రమై నవిగా నమ్ముతారు. ఈ నేఫథ్యంలో ఈసారి భక్తులకు తలంబ్రాలు పంపిణీ చేసేందుకు అధికారులు 250 క్వింటాల తలంబ్రాలను సిద్దం చేశారు. ఈ తలంబ్రాలను భద్రాచలం వరకు రాలేని భక్తులకు అందించేం దుకు టీఎస్‌ఆర్టీసి, పోస్టల్‌ శాఖలు ఏర్పాట్లు చేశాయి.

   మరోపక్క సీతమ్మకు ధరింపజేసే మంగళసూత్రం కూడా ప్రత్యేకమే. పుట్టిల్లు, మెట్టిల్లు వారి పుస్తెలతో అందరికీ రెండు మంగళసూత్రాలు ఉంటాయి. కానీ భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతమ్మకు మూడు మంగళసూత్రాలను ధరింపజేస్తారు. పుట్టినిల్లు జనక మహారాజు తరపున ఒకటి, మెట్టినిల్లు దశరథ మహారాజు తరపున మరొకటి ఈ రెండు సూత్రాలతోపాటు భక్త రామదాసు భక్తుల తరపున చేయించిన మరో సూత్రాన్ని కలిపి సీతమ్మ వారికి మూడు మంగళసూత్రాలను దరింపచేస్తారు. కేవలం ఒక్క భద్రా చలంలో మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. ఇక శ్రీరామనవమి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు. అయితే.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రాక పై సందేహం నెలకొంది. సీఎం సహా మంత్రులు, వీఐపీలు రాములోరి కల్యాణ వేడుకకు విచ్చేయనుండటంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావటంతో నిఘా వ్యవస్తను పటిష్టం చేసి భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

Latest Articles

రివర్స్ లవ్ స్టోరీగా రాబోతున్న ‘EVOL’

ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా కొత్తదనం ఉండేలా సినిమాలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్