25.2 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

పొలిటికల్ సెటైరికల్ మూవీగా సాయికుమార్ ‘లక్ష్మీకటాక్షం’

ఇప్పటి వరకు తెలుగులో చాలా తక్కువ సెటైరికల్ కాన్సెప్ట్స్ వచ్చాయి. అందులోనూ పొలిటికల్ సెటైరికల్ కామెడీ సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకులని నవ్వించడానికి ‘లక్ష్మీకటాక్షం’ సినిమా రాబోతోంది. ఈ సినిమా నుంచి డైలాగ్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. రాజకియనాయకులు ఒక ఓటుకి ఇంత డబ్బులు అని నిర్ణయిస్తారు.. కానీ ఈ డైలాగ్ పోస్టర్‌లో ఓటరే తన రేటును తాను నిర్ణయించుకుంటాడు.

మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వస్తున్న ఈ “లక్ష్మీకటాక్షం : ఫర్ ఓట్” కు రచన, దర్శకత్వం సూర్య అందించారు. యు. శ్రీనివాసుల రెడ్డి నిర్మించగా.. అభిషేక్ రుఫుస్ సంగీతం అందించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకి చాలా ఆప్ట్‌గా ఉంది ఈ డైలాగ్ పోస్టర్. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రధాన పాత్రలో, వినయ్, అరుణ్, దీప్తి వర్మ మెయిన్ లీడ్స్‌గా చేస్తున్నారు. ఈ కథ నేపథ్యం మొత్తం తాడిపత్రిలో చిత్రీకరించినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే సరదాగా ఉండే టీజర్, ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.

నటీ నటులు:
వినయ్
అరుణ్
దీప్తి వర్మ
చరిస్మా శ్రీకర్
హరి ప్రసాద్
సాయి కిరణ్ ఏడిద
ఆమనీ

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: మహతి ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి
రచన, డైరెక్టర్: సూర్య
మ్యూజిక్: అభిషేక్ రుఫుస్
డి ఓ పి: నని ఐనవెల్లి
ఎడిటర్: ప్రదీప్ జే
సౌండ్ డిజైన్: మురళీధర్ రాజు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఆర్. రంగనాథ్ బాబు
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను , ధీరజ్- ప్రసాద్

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్