వరంగల్‌లో రైతులు ఆందోళన

సొసైటీ అధికారుల తీరుతో రైతుల ఆందోళన బాట పట్టిన సంఘటన..వరంగల్ జిల్లా చింతలపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘంలో 644 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. సొసైటీ నిర్వాహకుల తీరుతో సభ్యులుగా ఉన్న రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో వారిపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోర్జరీ సంతకాలతో నిధులు దారిమళ్లిస్తూ తమ నిండా ముంచుతున్నారని వాపోయారు. రుణమాఫీ కావాల్సిన కోట్ల రూపాయల ధనం సొసైటీ నిర్వాహకులు, బ్యాంకర్ల నిర్వాహం వల్ల మాఫీ కాక తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు జరిగిన అన్యాయంపై బ్యాంకు అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగిన లాభం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించింది రుణమాఫీ విషయంలో తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. అలాగే అవినీతికి పాల్పడిన సొసైటీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Latest Articles

అనిల్ రావిపూడి.. ప్రయోగం చేయబోతున్నారా..?

హిట్ మిషన్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది అనిల్ రావిపూడి. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకీ, కళ్యాణ్ రామ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్