బీజేపీ 400 సీట్లు సాధించి అధికారంలోకి వస్తే, రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే తప్పుడు ప్రచారాన్ని ప్రతిపక్షాలు,, ముఖ్యంగా కాంగ్రెస్ సాగిస్తోందని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తాను రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు నకిలీ వీడియో సృష్టించడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ అండ్ కో రాజకీయంగా మరీ దిగజారి పోయిందని ఆయన విమర్శించారు. బీజేపీ మత పరమైన రిజర్వేషన్ల ను వ్యతిరేకిస్తుందని అమిత్ షా స్పష్టంచేశారు. అయితే ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీ ల రిజర్వేషన్లను పూర్తిగా సమర్థిస్తుందని హోం మంత్రి వివరించారు.
ప్రతిపక్షాలు సిద్ధాంతాలు, మేనిఫెస్టో ఆధారంగా ఎన్నికల్లో పోరాడాలి తప్ప. తప్పుడు వీడియోలు ప్రసారం చేయడం ద్వారా కుట్రలకు పాల్పడరాదని హితవు చెప్పారు. రిజర్వేషన్లపై తాను మాట్లాడినట్లు తప్పుడు వీడియో సృష్టించిన వారిపై ఢిల్లీపోలీస్ స్పెషల్ సెల్ చర్యతీసుకుంటుందని అమిత్ షా హెచ్చరించారు. తప్పుడు వీడియోతో ప్రజలనుతప్పుదోవ పట్టిచే యత్నం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు అన్నారు.


