ఆళ్ళగడ్డలో చెలరేగిన ఫ్యాక్షన్

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగిసినా ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ తగదాలు ఆగడం లేదు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ బాడీ‌గార్డ్‌ నిఖిల్‌‌పై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి అఖిల ప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా కొందరు దుండగులు కారులో అతివేగంగా వచ్చి ఢీకొట్టారు, అనతరం కారులోంచి దిగి నిఖిల్ తలపై ఇనుప రాడ్డుతో ఇష్టానుసారంగా చితకబాదారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను హుటాహుటిన నంద్యాల ఆసుపత్రకి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.

ఎన్నికల ముందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డకు వచ్చారు. ఆ సమయంలో భూమ అఖిల ప్రియ వర్గీలు తమ ప్రత్యర్థి అయిన ఏవీ సుబ్బారెడ్డి వర్గీలపై దాడి చేశారు. ఒకనొక దశలో నిఖిల్ కూడా సుబ్బారెడ్డిపై చేయి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఆయన వర్గీయులే నిఖిల్‌‌ను అత్యంత కిరాతంగా దాడి చేసి హతమార్చేందుకు కుట్ర చేసి ఉంటారని భూమా అఖిలప్రియ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

Latest Articles

క్రిష్ ప్రయోగం ఫలించేనా..?

మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్