ఘోర రోడ్డు ప్రమాదం …ఆరుగురు మృతి

పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. బాపట్ల జిల్లాలోని చిన్నగంజాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలంలో అదుపుతప్పి లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో వాహనాలు రెండూ నుజ్జునుజ్జయింది. ఆ వెంటనే మంటలు అంటుకోవడంతో ఆరుగురు మంటలకు ఆహుతయ్యారు.

ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. మృతుల్లో లారీ డ్రైవర్, మరో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తంగా ఆరుగురు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతులు అంజి, ఉప్పుగుండూరు కాశీ, ఉప్పుగుండూరు లక్ష్మి, ముప్పరాజు ఖ్యాతిసాయిశ్రీగా గుర్తించారు. వీరందరూ బాపట్ల జిల్లాకు చెందినవారే. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారే కావడం గమనార్హం. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలి పారు. గాయపడిన వారికి చిలకలూ రిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లారు. ఉత్సాహంగా ఓటు వేశారు. బంధుమిత్రులతో రెండు రోజుల పాటు సంతోషంగా గడిపారు. తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరారు. అంత లోనే వారిని టిప్పరు రూపంలో మృత్యువు కబళించింది. . బస్సు డ్రైవరు, టిప్పర్‌ డ్రైవరుతో సహా ఆరు గురి నిండు ప్రాణాలను బలిగొంది. కళ్లు తెరిచేలోపే అగ్నికీలలకు ఆహుతైన విషాదమిది. గాఢ నిద్రలో ఉన్న పదుల సంఖ్యలో ప్రయాణికులను తీవ్ర గాయాలపాలుజేసింది. తెల్లవారుజామునే ఆరుగురి బతుకులు తెల్లారిపోయాయి. ఏం జరిగిందో కూడా తెలుసుకోక ముందే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఎనిమిదేళ్ల చిన్నారి సహా ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్‌ వెళ్లేందుకు రాత్రి అరవింద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం – పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారి పాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్‌.. బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు రేగి.. ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి.

ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ సహా మరో ఐదుగురు ఆహుతి అయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది. ప్రమాదంలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ప్రమాదంలో గాయపడిన 20 మందిని చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాద బాధితులకు జీజీహెచ్‌లో చికిత్సను అందిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన నలుగురు కి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్సను అందిస్తున్నారు.

Latest Articles

నిమ్స్‌ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్‌ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్