ఉమ్మడి ఏపీ చివరి సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టానున్నారు. త్వరలోనే కిరణ్ కు బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వివిధ పదవులు చేపట్టిన ఆయన.. అనూహ్య పరిస్థితుల్లో 2010లో ఉమ్మడి ఏపీకి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2010 నవంబర్ 25 నుంచి 2014 మార్చి1 వరకు సీఎంగా ఆయన పనిచేశారు.
Read Also: ప్రభుత్వమే కథ అల్లి పోలీసులతో చెప్పిస్తుంది: ఎమ్మెల్యే రఘునందన్ రావు
Follow us on: Youtube, Instagram, Google News