స్వతంత్ర వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ జంక్షన్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో ఆయనకు గాయాలు అయ్యాయి. వెంటనే ఈ ప్రమాదం చూసిన స్థానికులు శర్వానంద్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శర్వానంద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలుపుతున్నారు. రాంగ్ రూట్‌లో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. కారులో సేఫ్టీ ఫీచర్స్ ఉండటం వల్ల.. పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం పై శర్వానంద్ టీం క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శర్వానంద్ టీమ్ తెలిపింది. ఇది చాలా స్వల్ప ఘటన అని.. కారులోని అందరూ క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేసింది. . కారులో సేఫ్టీ ఫీచర్స్ ఉండటం వల్ల.. పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న శర్వానంద్ తన ప్రియురాలు అయిన రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. జూన్ 3న రాజస్థాన్‌లో వీరి పెళ్లి జరగనుంది.
మరో వారంలో హీరో శర్వానంద్ పెళ్లి.. ఇంతలోనే యాక్సిడెంట్
0
526
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


