ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్

ఉత్తరప్రదేశ్‎లోని షామ్లీ జిల్లా ఝిన్‎ఝానా ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ముస్తాఫా గ్యాంగ్ సభ్యులకు, యూపీ ఎస్టీఎఫ్ పోలీసులకు మధ్య భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముస్తాఫా గ్యాంగ్ సభ్యులు నలుగురు మృతి చెందారు. దుండగుల కాల్పుల్లో ఎస్టీఎఫ్ ఇన్స్‎పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఇన్స్‎పెక్టర్‎ను ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్ కౌంటర్లో మృతి చెందిన ముస్తాఫా ముఠా సభ్యులను సతీష్, అర్షద్, మన్‎జీత్‌గా గుర్తించారు పోలీసులు. వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న ముస్తాఫా ముఠా సభ్యులను పట్టుకునేందుకు యూపీ ఎస్టీఎఫ్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను చూసిన నిందితులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్