స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు దసరా, బతుకమ్మ పండుగల సెలవులను ప్రకటించింది. ఈ సారి బతుకమ్మ, దసరా పండుగలకు కలిపి మొత్తం 13 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ ముందుగానే ప్రకటించింది. అయితే, గతేడాది దసరా సెలవులు 14 రోజుల పాటు ఇవ్వగా ఈ మారు అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకూ 13 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. ఆ మరుసటి రోజు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నెల 22న పెద్ద బతుకమ్మ (దుర్గాష్టమి), 24న దసరా అన్న విషయం తెలిసిందే.
దసరా సెలవులు అదుర్స్.. ఎన్ని రోజులంటే..?
0
371
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


