‘ఇంకా ఆధారాలు కావాలా రాహుల్?’.. ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఘటనపై కేటీఆర్ ట్వీట్

స్వతంత్ర వెబ్ డెస్క్: మెదక్‌ ఎంపీ, సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను బీఆర్ఎస్ నేతలు ముక్తకంఠంతో తిరస్కరించారు. దీని వెనక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తేనని అన్నారు. బీఆర్ఎస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్.. తమ పార్టీ అలాంటి హింసను ప్రేరేపించదని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటన వెనుక ఏ పార్టీ, ఎవరు ఉన్నారనేది పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించారు. ప్రభాకర్‌ రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ గూండానే అంటూ.. ఆ పార్టీ కండువాతో ఉన్న నిందితుడి ఫొటోలను పోస్ట్‌ చేశారు. ఇంకా ఆధారాలు కావాలా అని రాహుల్‌ గాంధీని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్