స్వతంత్ర వెబ్ డెస్క్: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని కోడికత్తి అంటూ మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు యశోద ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీసిన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడిందని చెప్పారు. ఇన్ఫెక్షన్ తగ్గడం కోసం ఐసీయూలో ట్రీట్మెంట్ కొనసాగుతోందని వివరించారు. ఇంత ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. కోడికత్తి.. అని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. దిగజారుడు, దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారని రెచ్చిపోయారు హరీష్ రావు. పోలీసుల విచారణ సాగుతోంది.. అతని ఫోన్ కాల్స్ ట్రేస్ చేస్తున్నారని వివరించారు. రాజకీయంగా కొట్లాడాలి.. కానీ, ఇలా చిల్లర హత్య రాజకీయాలు చేయకూడదని హెచ్చరించారు మంత్రి హరీష్ రావు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నామని… పదేళ్లు అధికారంలో ఉన్నాము కానీ ఎక్కడ ఎప్పుడు ఇటువంటి రాజకీయాలు చేయలేదన్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని కోడికత్తి అంటూ ట్రోల్ చేస్తున్నారు – హరీష్ రావు
0
497
Latest Articles
స్థానిక సంస్థల ఎన్నికలకు ‘సుప్రీం’ తాత్కాలిక బ్రేక్
ఏపీ రాజకీయ హింస ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. నామినేషన్ల ఘట్టంలో చోటుచేసుకున్న అక్రమాలు, శాంతిభద్రతల...
- Advertisement -
- Advertisement -


