ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షన్లను ఇంటింటికి వెళ్లి అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు. సుమారు 65లక్షల మందికి పెన్షన్ డబ్బులు అందజేస్తున్నారు అధికారులు. పలు కారణాలతో ఇవాళ పెన్షన్ అందుకోలేని వారికి రేపు అందించనున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇటు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించేందుకు నేడు సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు.